లవకుశ - సందేహించకు మమ్మా, ఊరకే కన్నీరు, శ్రీ రామ పరంధామా, ఏ నిమిషానికి ఏమి జరుగునో - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,698; 104 తత్వాలు (Tatvaalu) and views 225,614.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

గాయకులకు మాత్రమే గొంతు మాధుర్యము ముఖ్యము. మన భక్తులకు గొంతు ముఖ్యము కాదు, కేవలము భక్తి మాత్రమే. కాబట్టి, వాక్సుద్ది కోసము, మీరూ మీ పిల్లలు ఒక్క సారి పాడి అందరికీ వినిపిస్తారు కదూ.

గత పాటలు ప్రయత్నము చేసి, పంపిన గురువులకు వందనాలు. మీ పిల్లలను, దైవ కార్యములా, ఎంత భక్తి శ్రద్దలతో పెంచుతున్నారో, ఆ పిల్లల మాటలు పాటలే చెబుతున్నాయి.

పిల్లలకు అలా ఉత్తమ సంస్కారం అబ్బితే, మీ జీవిత చరమాంకములో, మీ చేతులు పట్టుకుని, వారి పసిపిల్లలు గా లాలించి ఆదరిస్తారు, మిమ్మల్ని ఒంటరిగా దూరముగా వదలరు సుమా. శాస్త్రము మాట, నా మాట పొల్లు పోదు.

1. చూడండి రామునిపై ఎంత నమ్మకమో - ఒకే మాట, ఒకే బాణము, ఒక్క భార్య అని, లేకపోతే నా కావ్యం వ్రుధా అవుతుంది అని, ఎంత బాగా ధైర్యం చెప్పారో. ఒక మంచి భర్తకు ఉండాల్సిన లక్షణాలు అన్ని చెప్పారు. మీరు జీవిత భాగస్వామికి నమ్మకము ధైర్యం కలిగిస్తారు కదూ?

సందేహించకు మమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా

ఒకే బాణము ఒకటే మాట ఒక్క భామకే రాముని ప్రేమ
మిన్నే విరిగి పడినా వ్రతభంగమ్ము కానీడమ్మా |సందేహించకు|

రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిననాడూ
నాదు జపము తపము నా కావ్యమ్మె వృధయగునమ్మ|సందేహించకు|

2. కన్న తల్లి కన్నీరు తుడచి, కారణము తెలుసు కోవడానికి, పిల్లలు ఇద్దరు, ఎంత బాగా ఒంటరి అమ్మను ప్రాధేయపడుతున్నారో, తమ శక్తి గురించి ఎంత ధైర్యం చెపుతున్నారో, చూడండి. మీరూ మీ అమ్మకు పాడి, ఆనందము కలిగిస్తారు కదూ.

ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మ
ఊరకే కన్నీరు నింప ఊరకే కారణమేమమ్మ
మారాడవిదేవమ్మా ||ఊరకే||

శ్రీరాముని మించిన ఈ వీరకుమారులము మేము 2
కోరితే బంగారు కొండ కొని తేగలమమ్మా. ||ఊరకే||

తల్లి చింత తీర్పలేని తనయుల బ్రతుకెందుకమ్మ 2
వల్లకాదు చెప్పకున్న వదలము నీ పాదములా ||ఊరకే||

3. ఆ సుగుణాభి రాముని ఎంత కీర్తించినా, మనసు త్రుప్తి చెందదు. హనుమంతుని, దూరముగా సీతమ్మ దగ్గరకు తీసుకుని వెళ్ళడానికి, పిల్లలు ఎలా రామ కీర్తనము మొదలు పెట్టారో చూడండి. మీ దేవుని పూజకు ఉపయోగము.

జయ జయ రాం 2
శ్రీ రామ పరంధామా
జయ రామ పరంధామా 2
రఘు రామ రామ, రణరంగ భీమ, జగదేక సార్వభౌమా |శ్రీ రామ|

పూజాన్వయాభి సోమా
సుగుణాభి రామ, శుభ నామా 2
కారుణ్యధామ దశకంఠవిరామ
రాఘవ రాజలలామా |శ్రీ రామ|

సాకేత పురాధిప రామా
సీతామనోహరా శ్రీరామా 2
అరవిందలోచనా సుందర సురుచిర
ఇందీవర శ్యామా... అ.. అ.. ఆ.. |శ్రీ రామ|

జయ జయ రాం, జయ రఘురాం 2
జయ జయ రాం...

4. సీతమ్మను వనాలకు తీసుకు పోతూ, లక్ష్మణ స్వామి బాధను ఏ విధముగా కనీరుతో చెప్పరో చూడండి. మన జీవితాలు కూడా, ఏ నిమిషానికి, ఏమి మలుపు తిరుగుతాయో తెలీదు, అందుకే దైవం పాదాలు పట్టుకుని, ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే, అన్ని కష్టాలు గట్టెక్క గలము, సీతా రాములు మాదిరిగా.

ఏ నిమిషానికి ఏమి జరుగునో.... ఎవరూహించెదరూ......
విధివిధానమును తప్పించుటకై..... ఎవరు సాహసించెదరూ.......ఏ నిమిషానికి

కంచెయె నిజముగ చేను మేసినా...... కాదను వారెవరూ........
రాజే యిది శాసనమని పల్కిన..... ప్రతిఘటించు వారెవరూ.........ఏ నిమిషానికి

కరుణామయులిది కాదనలేరా..... కఠిన కార్యమనబోరా.....
సాధ్వుల కెపుడూ వెతలేనా....... తీరని దుఃఖపు కథలేనా........ఏ నిమిషానికి

ఇనకులమున జనియించిన నృపతులు.....యీ దారుణము సహించెదరా......
వినువీధిన శ్రేణులుగా నిల్చీ.... విడ్డూరముగా చూచెదరా.....ఏ నిమిషానికి

ఎండకన్ను ఎరుగని యిల్లాలికి.... ఎందుకొ ఈ వనవాసాలూ....
తరచి చూచినా.... భోధపడవులే.......... దైవ చిద్విలాసలూ.........ఏ నిమిషానికి

అగ్ని పరీక్షకే నిల్చిన సాధ్విని........ అనుమానించుట న్యాయమా.....
అల్పుని మాటయె జనవాక్యమ్మని.... అల్పుని మాటయె జనవాక్యమ్మని....అనుసరించుటే ధర్మమా........
ఏ నిమిషానికి ఏమి జరుగునో.... ఎవరూహించెదరూ......
విధివిధానమును తప్పించుటకై..... ఎవరు సాహసించెదరూ.......
ఏ నిమిషానికి ఏమి జరుగునో.... ఎవరూహించెదరూ......ఎవరూహించెదరూ......

Lavakusa - sandehinchaku, urake kanniru, sri rama parandhama, e nimishaniki  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,698; 104 తత్వాలు (Tatvaalu) and views 225,614
Dt : 14-Apr-2022, Upd Dt : 14-Apr-2022, Category : Devotional
Views : 689 ( + More Social Media views ), Id : 1344 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : lavakusa , sandehinchaku , urake kanniru , rama , parandhama , enimishaniki , ntr , anjali
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content