Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1. అడుగో అతడే వాల్మీకి బ్రతుకు వేట అతనికి
2. ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం
3. శబరీ… ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. చిన్నప్పుడు సినిమా ఇది, నేటికీ ఆ పాట ఎంతో గుర్తు, ఎందుకంటే, ఈ పాటలో, వాల్మీకి ఏకలవ్యుడు శబరి గురించి 3 చరణాలలో కధ చెప్పారు, వారి గొప్ప తనాన్ని చెప్పారు.
పుట్టడం, తినడం, నిద్రపోవడం, 10 మందిని ఏడిపించడం, సంపాదించడం, దాచడం, ఉత్త చేతులతో పోవడం అనాధగా, ఇదేనా జీవితం? ఇతరులకు మన వలన ప్రయోజనం ఏమిటి? ధనం విదిలించడం మాత్రమే నిజమైన సహాయము కాదు, మంచి మనసుతో త్యాగం సేవ అది మాత్రమే, మన గుణాన్ని మారుస్తుంది. చూడండి ఈ మహాత్ముల కధనాలు.
మనలో 80 శాతం మంది, మారాలి, మారకపోతే, నష్టం వారికే, ఈ జన్మలో అయినా వచ్చే జన్మలో అయినా, పాప ఫలితము ఎటూ తప్పించుకోలేరు. పంచభూతాల దగ్గర, ధనము హోదా అధికారము బలము పని చేయదు. కాల చక్రములో నలిగిపోతారు.
మొదట, బోయవాడు కరకు మనిషి, మంచి చెడు తెలీని వ్యక్తి, తన ఆకలి తన స్వార్ధమే ముఖ్యం. కానీ ఆ పక్షిని చంపిన తర్వాత, అతనికి తన తప్పు తెలిసింది, ఇతరుల కన్నీరు అర్ధం అయ్యింది, ఆ ప్రాణాలు తీసే వ్రుత్తినే మానేసారు. గొప్ప కావ్యాలు శ్లోకాలు రాశారు.
నవరసభరితం రాముని చరితం, జగతికి ఆతడు పంచిన అమృతం. ఆ వాల్మీకి మనవాడు మనలోనే ఉన్నాడు. అక్షరమై మన మనసు వెలిగితే మనలోనే ఉంటాడు.
ఏకాగ్రత ఉంటే ఏమైనా సాధించవచ్చు అని, ఏకలవ్యుడు తెలిపారు. గురువును మట్టి బొమ్మ గా మలచి, ఆయన ఎదురు సాధన చేసాడు. అర్జునుడు కంటే ఇంకొకరు అధికములో ఉండకూడదు అని, అలాగే ఇతని వలన దుర్యోధనుడు బలవంతుడు కాకూడదని, ముందు చూపుతో, రాబోయే ప్రమాదాన్ని, నివారించారు.
ఎరుకలవాడు అయితేనేమి, గురికల వాడే మొనగాడు. అందుకే అంది, గుణమును బట్టి వర్ణం అంది, జన్మను బట్టి కాదు. వేలునిచ్చి తన విల్లును విడిచి, వేలుపుగా ఇల వెలిగాడు.
రామ ధ్యానముతో శబరి తరించిపోయినది. ఇంటికి వచ్చిన రామునికి, తన్మయత్వములో పండ్ల రుచి చూసి, ఎంగిలి పండ్లు ఇచ్చినా, ఆ పరంధాముడు స్వీకరించారు. మరి ఇలాంటి ఉత్తమ మహిళలు, ఎంత మంది ఉన్నారు, నిస్వార్ధముగా దైవ చింతనతో.
ఆమె ఎవ్వరో కాదు సుమా, ఆడబడుచు మన జాతికి. జాతిరత్నములు ఎందరెందరో మనలో కలరీ నాటికీ. అడివిని పుట్టి పెరిగిన కథలే, అఖిల భారతికి హారతులు. నాగరికతలో సాగు చరితలో, వీరే మనకు సారథులు.
పాట -
మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ
పట్టుదలే ఉంటే కాగలడు మరోబ్రహ్మ
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు
అడుగో అతడే వాల్మీకి బ్రతుకు వేట అతనికి
అతిభయంకరుడు యమకింకరుడు
అడవి జంతులపాలిటి అడుగో అతడే వాల్మీకి
పాలపిట్టల జంట వలపు తేనెల పంట
పండించుకుని పరవశించి పోయేవేళ
ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు
ఒక పక్షిని నేల కూల్చాడు
జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ
తన కంటిలో పొంగ మనసు కరగంగ
ఆ శోకంలో ఒక శ్లోక ం పలికే ఆ చీకటి ఎదలో దీపం వెలిగే
కరకు బోయడే అంతరించగా కవిగా ఆతడు అవతరించగా
మనిషి అతనిలో మేల్కొన్నాడు కడకు మహర్షే అయినాడు
నవరసభరితం రాముని చరితం జగతికి ఆతడు పంచిన అమృతం
ఆ వాల్మీకి మీవాడు మీలోనే ఉన్నాడు
అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు
అందుకే…
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు
ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం
తిరుగులేని దీక్షకీ అతడే ప్రాణం
కులం తక్కువ ని విద్యనేర్పని గురువు బొమ్మగా మిగిలాడు
బొమ్మ గురువుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు
హుటాహుటిని ద్రోణుడపుడు తటాలుమని తరలివచ్చి
పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు
ఎదుట నిలిచిన గురుని పదమంటి
ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు
బొటనవ్రేలివ్వమనె కపటి ఆ ద్రోణుడు
వల్లెయనె శిష్యుడు చెల్లె ద్రోణుని ముడుపు
ఎరుకలవాడు అయితేనేమి గురికల వాడే మొనగాడు
వేలునిచ్చి తన విల్లును విడిచి
వేలుపుగా ఇల వెలిగాడు
అందుకే…
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు
శబరీ… ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి
ఆశ కరువిడి అడుగు తడబడి రామపాదము కన్నది
వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అపుడు
కనుల నీరిడి ఆ రామపాదము కడిగినది శబరి
పదముల ఒరిగినది శబరి
ప్రేమ మీరగ రాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి
కోరికోరి శబరి కొరికిన దోర పండ్లను ఆరగించె
ఆమె ఎంగిలి గంగ కన్న మిన్నగ భావించిన
రఘురాముడెంతటి ధన్యుడో
ఆ శబరిదెంతటి పుణ్యమో
ఆమె ఎవ్వరో కాదు సుమా ఆడబడుచు మీ జాతికి
జాతిరత్నములు ఎందరెందరో మీలో కలరీ నాటికీ
అడివిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు
నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు
అందుకే…
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతార
మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.
Krushi Unte Manushulu, Adavi Ramudu, NTR, jayaprada, jayasudha
చిత్రం : అడవి రాముడు (1977), రచన : వేటూరి సుందర రామమూర్తి, సంగీతం : కె.వి.మహదేవన్, గానం : ఎస్.పి.బాలు, బృందం
manishai puTTinavadu Krushi Unte Manushulu, jati ratnamulu Adavi Ramudu, NTR
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,399,215; 104 తత్వాలు (Tatvaalu) and views 259,060 Dt : 24-Sep-2022, Upd Dt : 24-Sep-2022, Category : Songs
Views : 796
( + More Social Media views ), Id : 1533 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
manishai ,
puttinavadu ,
krushi ,
manushulu ,
jati ,
ratnamulu ,
adavi ,
ramudu ,
ntr ,
jayaprada ,
jayasudha Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments