రైతుబిడ్డ - మనిషిని నమ్మితే ఏముందిరా, మబ్బును నమ్మినా? - ఎన్టీఆర్, వాణిశ్రీ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2152 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,399,026; 104 తత్వాలు (Tatvaalu) and views 259,043.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మన మనుషుల బతుకుల, కపట అవసర అవకాశవాద, గొప్పతనాన్ని ఎంత గొప్ప గా ఆనాడే చెప్పారో చూడండి 50 ఏళ్ళ క్రిందట.

మబ్బును నమ్మినా, వాన ఇవ్వవచ్చు, తీగను నమ్మినా పూలు ఇవ్వవచ్చు, గోవును నమ్మితే పాలు ఇస్తుంది, పాముకు దండం పెడితే పక్కకు తొలగవచ్చు, కానీ మనిషి స్వార్ధం తో, విషము కక్కు తాడు, దయా దాక్షిణ్యము ఉండదు అని ఎంత బాగా చెప్పారో.

అందుకే మనము కూడా, పెద్దలు చెప్పిన మాటలు తూచ పాటించాలి కాబట్టి, విషం కక్కుతూ, పెంచి పోషించిన తల్లి దండ్రులనే, మీకు మాకు మా పిల్లల కున్న సౌకర్యాలు అవసరం లేదు, ఊళ్ళో మన వారు చూసుకుంటారు, ఇవిగో ధనం అని ముష్టి వేస్తూ, మన లాంటి భస్మాసురులను కన్న, ఆ పాపాత్ములను శిక్షించడానికై, సంస్కారం క్రుతజ్ఞత నేర్పని దానికి ఫలితముగా, దూరముగా ఉంచుతున్నాము, ముదుసలి వయసులో రోజు చేయి పట్టుకునే భాగ్యం ఇవ్వక, కోట్లు ఆస్తి ఇళ్ళు అన్ని ఉన్నా కూడా.

కుడిచిన పొదుగునే, పొడిచే వారున్నారు. పెట్టిన చేయినే, విరిచే వారున్నారు. 80 శాతం మనలో ఇలాంటి వారే, వీరే అరిషడ్వర్గాల మరియు అష్టవ్యసనాల బానిసలు. మరి ఇక వీరి సంతానము గొప్పతనము తో, వీరికి ఆ తిప్పలు తప్పవు రేపు. చివరి నిమిషము దాకా, వాస్తవము, వీరి కళ్ళకు కనపడదు, వినపడదు. ఆ తర్వాత, వీరిని అనుకునే వారూ ఉండరు.

మనిషిని నమ్మితే ఏముందిరా..?
మబ్బును నమ్మినా.., ఫలితముందిరా.., నాన్నా

తీవెను పెంచితే పూలిస్తుందిరా
గోవును పెంచితే పాలిస్తుందిరా
పామును మొక్కుకుంటే, పక్కకు తొలగునురా
మనిషిని నమ్ముకుంటే, పచ్చి విషం దొరుకునురా 2 ||మనిషిని నమ్మితే||

కుడిచిన పొదుగునే, పొడిచే వారున్నారు
పెట్టిన చేయినే, విరిచే వారున్నారు
బంధువులని చెప్పుకునే, రాబందులు ఉన్నారు
మేకవన్నె పులులు, ఈ లోకమంతా ఉన్నారు 2 ||మనిషిని నమ్మితే||

మెత్తగ మసులుకుంటే, మెతుకు పుట్టదు, నాన్నా
మంచికి ఈలోకం విలువ కట్టదు - 2 సార్లు 2 లైన్లు
ఏటికి ఎదురీదనిదే, గట్టు దొరకదు
ఎత్తుకు పై ఎత్తులేక, ఏదీ జరుగదు 2 ||మనిషిని నమ్మితే||

-సినారె, రైతుబిడ్డ 1971, సాలూరి హనుమంతురావు
Manishini Nammite Emundiraa, Rythu Bidda, NTR, Vanisri, Jaggaiah
ఎన్టీఆర్, వాణిశ్రీ, జగ్గయ్య
Manishini Nammite Emundiraa, mabbunu namiina, Rythu Bidda, NTR, Vanisri  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,399,026; 104 తత్వాలు (Tatvaalu) and views 259,043
Dt : 24-Sep-2022, Upd Dt : 24-Sep-2022, Category : Songs
Views : 746 ( + More Social Media views ), Id : 1534 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : manishini , nammite , emundiraa , mabbunu , nammina , rythubidda , ntr , vanisri
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content