Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Prema Yatralaku (Parody) - Gundamma Katha - NTR, ANR, Savitri, Jamuna
ఏవండీ వారం నుంచి మీ ఇంటిల్లిపాదీ కనపడలేదు, ఎవరింట్లో అన్నా తిష్టవేసారా, అన్నము ఖర్చు హోటల్ ఖర్చు తగ్గుంది ఇంట్లో పని భారం ఉండదు అని, ఓ వారం పది రోజులు.
అబ్బే లేదండీ, ఈ సారి అలా జనాల ఇళ్ళ మీదకు పోయి, నటించకుండా అవసర అవకాశాలకు, తీర్ధ యాత్రలకు వెళ్ళాము అండి. అక్కడ ధర్మ సత్రాలు ఉంటాయి, ఉచిత భోజనము ఉంటాయి కదా.
మరి దైవ దర్శనము బాగా జరిగిందా. చేదు దోశకాయ, ఎన్ని తీర్దాలు తిప్పినా, చేదు వదలదు అంటారు విన్నారా.
దర్శనము బాగా లేదండీ, ఉచిత దర్శనము 20 గంటలు, ధన దర్శనము 3 గంటలు. డబ్బులు ఎందుకులే రేపు 2 వ ఇల్లు కొనవచ్చు కాస్త అప్పు చేసి, చీటీలు ఎగ్గొట్టి, మా పిల్లాడిని ఎంతో కొంత కట్నానికి అమ్మి అని, ఉచిత దర్శనములో వెళ్ళాము. మా పిల్లకు కూడా చెప్పాము, ఆస్తిపరులను చూసి ప్రేమించమ్మా అని, కధ అడ్డం తిరిగినా సగం ఆస్తి వస్తుంది, మనకు తెలిసిన లాయరు చెప్పారు అని కూడా చెప్పాము.
అంతా తోపులాట, మాయమంది, నెట్టుకోవడం, తిత్తుకోవడం, మంచి మర్యాద లేదు, గోవిందా గొవిందా అనాలన్న నోరు ఎవరికీ రావడము లేదు. జుట్టు ఇవ్వాలంటే, అందం తగ్గుతుంది అని ఎవ్వరము ఇవ్వము. మా దెబ్బకు ఆయనకు పూర్తి బట్టనెత్తే కాబట్టి కుదరదు. ఇది 100 వ సారి అండి, మాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి. చేదు దోశకాయ కధ మాకు తెలుసు, 80 శాతం మందిమి అదే కదా.
నిజమా, ఎంత అద్రుష్టవంతులు మీరు, మేము మొత్తము ఓ 10 సార్లు వెళ్లాము ఈ జన్మలో. మరి 100 సార్లు వెళ్ళారు కదా, ఏమైనా మీలో మార్పులు వచ్చాయా, సాధనలు పెరిగాయా, మనశ్శాంతి వచ్చిందా, అప్పులు లేవా, మోహ బ్రమలు వీడాయా, కపట నాటకాలు 2 నాల్కలు వదిలామా? మీ పిల్లల దగ్గర మీ ముదుసలి తనములో గౌరవముగా ఉంటారా? మీ అమ్మ నాన్నను అత్త మామలను తెచ్చి మీ ఇంట్లో పెట్టుకుని సజీవ గురువు సేవ చేస్తారా?
చేదు దోశకాయ లాంటి వారము అని చెప్పాక అవి మీరు అడవచ్చా వదినా. మేము మారము, మా అప్పులు, మా ఇంట్లో తిట్లు, మా 2 నాల్కలు అవి ఏవి మారవు, మరలా ఏడాదికి 2 పౌర్ణములకు సత్య నారాయణ స్వామి పూజ కూడా చేస్తాము, అందరూ వస్తే, మా కొత్త బట్టలు ఇల్లు నగలు చూపిస్తాము. కనీసం ఆ గంట కూడా సత్యం మాట్లాడము వదినా. నోటికి మంత్రాలు రావు, కమ్మటి పాట రాదు.
మాలాంటి వారిని కని, గొడ్డును సంతలో అమ్మినట్లు అమ్మిన, ఆ పాపాత్ములను మా సౌకర్యాలతో గౌరవించము. ఇంట్లో ఉంచి, చేయిపట్టి నడిపించము. పెద్ద ఆసుపత్రులకు దగ్గర ఉండి, తీసుకు పోము. మా భాగస్వామి కూడా తగ్గదే దొరికింది, అదే మాట మీద ఉంది, వారి అమ్మా నాన్న విషయములో కూడా. ఇక మా పిల్లల సంత, మా మాట వినే స్థాయి ఎప్పుడో దాటిపోయారు, మా బతుకు బస్టాండే చివరకు.
ఇక మార్పులు అంటావా, గోడ మీద తేదీలు, దేవస్థానం సభులు చైర్మన్, మనం నక్క పాము పులి బుద్దితో ఎన్నుకున్న నాయకులు, దర్శన ప్రసాదం ప్రయాణ ఖరీదులు మారతాయి కానీ, మనము మన బుద్ది మారదు కదా వదినా అని నవ్వుకున్నారు ఇద్దరు మనస్పూర్తిగా.
అలా స్వచ్చముగా మన మనసుని, మన భావనలను స్పష్టముగా చెపితే, మనము కనీసం రాక్షస స్థాయిలో ఉంటాము. వారి కన్నా నీచముగా ఎందుకు?
అందుకే ఇన్ని తిప్పలు పడి, కాశీ రామేశ్వరము పోయి, అక్కడ గుంట తవ్వి గంగ మట్టి తెచ్చి, ఇక్కడ పూడిక పూడ్చి, చివరకు మనలో వచ్చిన మార్పు శూన్యం.
అందుకే, ముందు మనము అర్హత సంపాదించాలి సాధనతో. అప్పుడు మనం ఉన్న చోటే దేవాలయము, మన మనసే దేవుని మందిరము, రూపాయి ఖర్చు లేదు కదా. అర్హత వచ్చిన తర్వాత తీర్ధ యాత్రలకు వెళితే, పుణ్యం పురుషార్దం మిత్రమా.
ఎంట్రన్స్ పరీక్ష రాసి, ఆంధ్రా యూనివర్సిటీ అర్హత పొందకుండా, ఆ గోడల చుట్టు పొర్లు దండాలు పెట్టి, కొబ్బరి కాయ కొట్టి, హారతి ఇస్తే, సీటు ఇస్తారా? ముందు పరీక్ష రాసి, రాంక్ కొట్టమ్మా అంటారు కదా? మరి దేవుడు వీరికన్నా తక్కువనా? అర్హత మనకు వద్దా? తన వైపు 10 అడుగులు వేస్తే, ఆయన 100 అడుగులు కిందకి దిగి వస్తారు. మరి మనం ఒక అడుగు కూడా సాధనలో వేయమే?
శాంతి యాత్రలకు, బృందావనము, నందనవనము ఏ.లనో
వరాల నొసగు, దైవం చెంతన, వేరే స్వర్గము ఏలనో..? 2 ఆహాహా ఆహాహా హా ||శాంతి యాత్రలకు||
తీర్థయాత్రలకు రామేశ్వరము, కాశీ ప్రయాగా లే.లనో
పూజిన్చిన దైవం, మదిని ఉండగా, వేరే యాత్రలు ఏలనో.. ఆహాహా ఆహాహా హా 2 ||తీర్థయాత్రలకు ||
దైవం నగుమోమే, చంద్రబింబమై, పగలే వెన్నెల కాయగా ఆహాహా ఆహాహా హా 2
గురు సరి చూపుల, చల్లదనంతో, జగమునె శాంతి పూయదా.. ఆహాహా ఆహాహా హా 2
శాంతి యాత్రలకు, కొడైకెనాలు, కాశ్మీరాలు ఏలనో
ఉన్న చోటనే, ఉన్న దానితో, అన్ని ముచ్చటలు తీరగా.. 2 ఆహాహా ఆహాహా హా
మదిని ధ్యానమే, మనకు మోక్షమని, సర్వశాస్త్రములు చాటగా 2 ఆహాహా ఆహాహా హా
తీర్థయాత్రలకు, కెైలాసాలు, వైకుంఠాలు ఏలనో
మానవసే మాధవసేతో, భువికి స్వర్గమే దిగిరాదా…
శాంతి యాత్రలకు, బృందావనము, నందనవనము ఏ..లనో.. ?!
చిత్రం : గుండమ్మ కథ (1962); సంగీతం : ఘంటసాల; సాహిత్యం : పింగళి నాగేంద్ర రావు; గానం : ఘంటసాల, సుశీల
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2269 General Articles and views 2,609,457; 104 తత్వాలు (Tatvaalu) and views 278,302
Dt : 31-Aug-2023, Upd Dt : 31-Aug-2023, Category : Songs
Views : 601
( + More Social Media views ), Id : 1900
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Prema ,
Yatralaku ,
Parody ,
gundamma ,
katha ,
parody ,
ntr ,
anr ,
savitri ,
jamuna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments