25 ఏళ్ల కు రామన్న కన్నీరు- బతిమాలాం, తప్పలేదు, కరెక్ట్ చంద్రన్న, బలపరచిన బాలయ్య - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2152 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,396,532; 104 తత్వాలు (Tatvaalu) and views 258,835.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా
చంద్రన్న మోచేతి నీరు తాగుతూ, ఆయన కే ద్రోహం
పండిత పుత్ర, పరమ శుంఠ
రంకు నేర్చిన వారు బొంకు నేర్వరా
పులి కన్నా, కపట పాము/నక్క తో ప్రమాదం
రామాంజనేయ యుద్ధం, అధికార మార్పిడి కోసం?
దుష్ట చతుష్టయం, కౌరవులు, ఒప్పు అంటే అది ధర్మం?
75 మంది చెడు, 25 మంచి. ఎన్నికల గెలుపు, ఖచ్చితముగా ధర్మం?
చంద్రన్న మంచి అయితే, రామన్న చెడ్డ?
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*25 ఏళ్ల కు మళ్ళీ రామన్న కన్నీరు - బతిమాలాం, బెదిరించాం, లొంగలేదు, తప్పలేదు, వెన్నుపోటు కరెక్ట్ అన్న చంద్రన్న, బలపరచిన బాలయ్య*

ఏమండీ, చంద్రన్న బాలయ్య మాటలు చూసారా, ఎంటీయార్ అభిమానిగా నాకు కన్నీరు ఆగడం లేదు. మీరు చెప్పండి ఎవరిది అన్యాయం? ఈరోజుకూ తప్పు ఒప్పుకోరా?

జవాబు - ఫోటోలు లోపల చూడండి. పాత కధనం మీకు తెలుసు. మనము, వారి కధనాలు రాసిన మీడియా మీద వ్యక్తుల మీద, కోపపడటం లేదు, కేవలం సంఘటన మీద మాత్రమే, న్యాయం ధర్మం మాట్లాడుతున్నాము. మీరు అలాగే సంఘటన గురించే మాట్లాడాలి, విలేఖరి మీడియా గురించి కాదు మిత్రమా. 1. link1 2. link2

సిమ్హం లేదా ఆత్మాభిమానం కష్టపడటం తెలిసినవారు, చావనైనా చస్తారు కాని, బెదిరింపులకు లొంగరు, కానీ ప్రేమ అభిమానం ఆప్యాయతకు లొంగుతారు.

మీ ఆలోచనలు కూడా నిష్పక్షపాతముగా పంచుకోండి, మీకు తగిన రాత మరియు అరిషడ్వర్గాల అనుభవం ఉంటెనే, తెలుగు లో ఉదాహరణ సాక్ష్యము తో. వితండవాదం వద్దు.

రామన్న ఆత్మ క్షోభిస్తుంది, కన్నీరు కారుస్తుంది. నన్ను గౌరవించేవారు, నా ఉప్పు తిన్న వారిలో ఒక్కరూ లేరా, అని ఘోషిస్తుంది.

అన్నా, మేము ఉన్నాము, మీ ఉప్పు తినకపోయినా, అన్యాయం ను ఎండగడతాం. అలాంటి ద్రోహం రేపు, మనకు, మన కొడుకు కూతురు కోడలు అల్లుడుకు, మన ఇంట్లో జరగకుండా ప్రయత్నం చేస్తాం, లేదంటే అదే తప్పు మన ఇంట్లో జరుగుతుంది. ఇతరులను కపటంతో కూల్చకుండా, స్వయం క్రుషితో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని, ప్రతి వ్యక్తిని గౌరవిస్తాము, సమర్ధన చేస్తాం, అని ప్రతి ఒక్క ధర్మ కార్యకర్త వాదన.

చంద్రన్న కు, సరైన ముందు చూపు గల, నీతి సూక్ష్మ సలహా దారులు లేరు అని మరలా నిరూపణ, కనీసం అబద్ధాలు అతికేటట్టు చెపడం కూడా చేయడం లేదు, నేటికీ పశ్చాత్తాపం కూడా కనపరచడం లేదు.

పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా అన్న సామెత లాగా, తప్పు ను ఒప్పుగా లేదా పశ్చాత్తాపం గా చెప్పించడం వీరికి చేతకావడం లేదు. దయచేసి ఆ సలహాదారులు కు ఇవి పంపగలరు.

చంద్రన్న మోచేతి నీరు తాగుతూ కూడా, ఆయన కే ద్రోహం చేస్తూ, తప్పుడు సలహాలు ఇస్తూ, ఈ అవసర అవకాశ వాదులు, మా రెండో అబ్బాయి చంద్రన్న ను దోషిగా ఇంకా, 25 ఏళ్ల కు కూడా నిలబెడుతున్నారు.

స్వార్థం దురాశ పదవీ వ్యామోహం మాయ లో పడి, ఇతరుల ఆటకు బలవుతున్న, అమాయక చక్రవర్తి చంద్రన్న గా చూపలేకపోతున్నారు. హత్య చేసిన వాని కన్నా, వెనక పధకం వేసి అమలు చేసిన వారికి, ఎక్కువ పాపం అన్న విషయం చెప్పలేకపోతున్నారు. కనీసం పశ్చాత్తాపం కూడా లేదు.

1) *ముందు మాట - గుణపాఠం లు* -

1. పండిత పుత్ర, పరమ శుంఠ. ధన సంపాదనలో పడి, పిల్లల కు సంస్కారం నేర్పడం మరవడం. మన పెంపకమే, మన కన్ను పొడవడం, ముదుసలి ఒంటరి లేదా ఆశ్రమం. భస్మాసురులను పెంచుతూ, మనం అందరం అదే పని లో ఉన్నాము.

2. రంకు నేర్చిన వారు బొంకు నేర్వరా. తడి గుడ్డతో గొంతు కోయడం. అవసరం అవకాశం కు అబద్ధాలు.

3. అహంకారం దుర్యోధనుని (పులి) కన్నా, కపట శకుని (పాము/నక్క) తో ప్రమాదం. ఆవు కు కపట నటన పూజ, కానీ గెలిపించము సమర్ధించం ఆచరించం.

4. అరిషడ్ వర్గాల అష్టవ్యసనాల మత్తులో, ధర్మం అధర్మం కు తేడా, మరవడం. ఎన్ని ఏళ్ళు అయినా, తమ తప్పును తాము ఒప్పుకోలేక, సమర్ధించడం, కాల శిక్షకు గురై, కాల గర్భం లో కన్నీరు మున్నీరు గా కలసి పోవడం. తర్వాతి జన్మ ఇంకా నరకం, గరుడ పురాణం.

5. రామాంజనేయ యుద్ధం, అధికార మార్పిడి కోసం కాదు, ఇచ్చిన అభయ రక్షణ మాట కోసం. దొంగ కపట యుద్ధం కాదు, పబ్లిక్ యుద్ధం. రాముని కి ఎటువంటి అవమానం అధికార నష్టం జరగలేదు. ఆంజనేయుడు అధికారం పొందలేదు.

6. అవసర అవకాశ వాదులు మూర్ఖులు, దుష్ట చతుష్టయం, కౌరవులు, ఒప్పు అంటే అది ధర్మం అయిపోదు. కలియుగ ఒంటి పాద ధర్మం అదే - 75 మంది చెడు, 25 మంచి. ఎన్నికల గెలుపు, ఖచ్చితముగా ధర్మం కాకపోవచ్చు అని ఇదే రుజువు.

7. ముందు చూపు దురాశతో, స్వయం పతనం లో, అన్ని పార్టీలు దగ్గర ధనం తీసుకుని అమ్ముడుబోయి, ఓటు వేసే ఓటరన్న, ఇచ్చిన గెలుపుకు, ధర్మం కు సంబంధం లేదు. ఉదాహరణకు, శ్రీ లంక ఓటర్లు తో గెలిచిన ప్రభుత్వం లే, వారిని రోడ్లు వెంట పరుగులు తీయించాయి. వారు ఓటేసి, వారే తిట్టడం ఎందుకు? గెలిపించాక, వారే తప్పు అయ్యారు కదా?

2) *గతం పాట - చంద్రన్న మాటలు* - ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు చేశారు. 5 గురు, ఆ నిర్ణయం వెనుక సాక్ష్యంగా ఉన్నారు (గుణపాఠం 6). 5 గురం కలిసి ఎన్టీఆర్‌ను కలి శాం. రాజకీయాలపై చర్చించాలని కోరాం. అప్పుడు వచ్చిన వారిలో ఇద్దరిని (హరికృష్ణ, బాలకృష్ణ - గుణపాఠం 1) బయటకు పంపించాక. 3 గంటలు చర్చించారు. నేను చాలా సేపు రిక్వెస్ట్‌ చేశాను. మీటింగ్‌ పెట్టుకుందామన్నా. చివరకు కాళ్లు పట్టుకుని అడుక్కున్నా ( గుణపాఠం 2, 3). మీరు ఒక్కటంటే ఒక్క మీటింగ్‌ పెట్టి ధైర్యం ఇస్తే చాలండి, ఇంకేం జరగదని చెప్పా. ఆయన వినలేదు. తర్వాత మీకు కూడా తెలిసిందే. రామాంజనేయ యుద్ధమే జరిగింది (గుణపాఠం 5). అది చరిత్ర. ఎన్టీఆర్‌తో ముందుకు వెళ్లాలనేది అందరి అభీష్టం. అయినా.. వ్యక్తి కన్నా.. ఆయన సిద్ధాంతాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అందరం ముందుకువెళ్లాం (గుణపాఠం 4).

3) *చంద్రన్న వివరణ పై విశ్లేషణ* - రెండో కోడలు మంచిది అంటే, మొదటి కోడలు చెడ్డదనే కదా అర్థం. చంద్రన్న మంచివాడు అయితే, రామన్న చెడ్డవాడు అనే కదా అర్థం. రామన్న పార్టీ ని నాశనం చేయబోతే లేదా మూర్ఖత్వం తో తెలివి తక్కువ తనంతో ఇతరుల గుప్పిటలో నాశనం చేయబోతే, మేము వెన్నుపోటు తో పార్టీ ని అత్యవసర పరిస్థితి లో కాపాడాం, అనే కదా అర్థం. అవ్వ, ఆయననే తప్పు పట్టేంత సమర్ధులా, స్వయం ప్రకాశకులా వీరు?

ఆయన భార్య మాట వినడం (తప్పు ఒప్పు మనకు అనవసరం, ఆయన ఇష్టం), ఆయన పార్టీ ని అప్పగించడం మనకు తప్పు అయితే, నీతి గల ఎమ్మెల్యేలు ఎంపీలు తో, కృతజ్ఞతలు విశ్వసనీయతలు గల తెలివైన కొడుకులు కూతురులు తో, సొంత పార్టీ పెట్టి గెలిచి, నిరూపించవచ్చు. పార్టీ మీటింగ్ లో, రామన్న ను ఎండగట్టవచ్చు తొలగించవచ్చు. ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు చేశారు అనే మాట తప్పు, తిరుగుబాటు చేయించాము ప్రలోభాలు పెట్టి అన్నది కరెక్ట్.

ఈ మధ్యకాలం లో, తెరాసా ప్లీనరీ పెట్టి, భారాసా గా, అందరి ఎదురు పేరు మార్చింది. అధికారం కోసం, రాష్ట్రాన్నే చీల్చిన మేము, మా క్షేమం కోసం, దేశానికైనా అలాంటి మంచి ఎంతో చేస్తాం మరలా నమ్మండి అని, బహిరంగముగా ఎలుగెత్తింది. తప్పు లేదు, వారి నిర్ణయం, ఆశ వారిది. మనము 100 కి 75 మంది మి మోహములో, వారి ఆశలు నిజం చెయ్యడానికి రెడీగా ఉన్నాము. ఆంధ్రా లో కూడా, ఉత్తములు ద్రోహానికి రెడీగా ఉన్నారు, భారాసా సహాయ సహకారాలకు. కేసీఆర్ అల్లుడు లేదా కొడుకు, కేసీయార్ కు స్తితి సరిగ్గా లేదు అని, ఆ పార్టీ మీటింగ్ లో పగ్గాలు అందరి ఎదురు తీసుకున్నా, వెన్నుపోటు అని మనం అనలేం, అనకూడదు కదా.

పోనీ మీ వెన్నుపోటు కరెక్ట్ అని కట్టుబడి ఉంటే, ఇంక ద్రోహి రామన్న ఫోటో ఉండకూడదు కదా. రామన్న ఫోటో నేటికీ ఉందీ అంటే, రామన్న మంచి వాడు, చంద్రన్న ను ఒక్కడినే జనం నమ్మడం లేదు, అవసరం అవకాశం కు వాడుతున్నాం అనే కదా మీరు చెబుతోంది. పార్టీ ని నాశనం చేయబోతున్న రామన్న నుంచి మీరు కాపాడి, మరలా ఆయన ఫోటో తో రాజకీయం, అవ్వ. ఏదో ఒకటి మనం ఒప్పుకోవాలి, దానితో నిలబడాలి.

మొన్న ఒకరి కుటుంబ కంపెనీ వాదన విన్నాము, ఏమండీ మా భాగస్వామి ని, వారి కష్టార్జితం ఆస్తి అధికారం మొత్తము రాయమని మా పేర అడిగాము, కాళ్ళు పట్టుకున్నాము, చుట్టాలు పిల్లలు అందరి ఎదురుగా. అయినా వారు వినలేదు, మొండికేసారు రాయమని, ఇక చేసేది లేక, వారిని పిచ్చివాడిగా ముద్రవేసి, పిల్లలకు బంధువులకు, తలా కొంత ధనం అధికారం పంచాము. ఇది నిజమో కాదో, బతిమాలామో లేదో, పిల్లలను బంధువులను అడగండి అన్నారు. మేము ఇది రామాంజనేయ యుద్దం లాగా జరగకుండా ఉండటానికి, భాగస్వామి ఆరోగ్యం నిలబడటానికి, ఎంతో క్రుషి చేసాము. పని వాళ్ళు తిరుగుబాటు చేసారు అని చెప్పాము, ఆయన వినలేదు.

ఇక ఆగలేక ఆపలేక పోయాము, తప్పనిసరి పరిస్తితిలో, వెన్నుపోటు పొడిచాము అన్నారు. వారి పిల్లల్ను అడిగాము, ఇది ద్రోహం కదా అని, కన్న తండ్రికి ఇలా అని, వారూ కూడా, మేము బతిమాలాము, ఆస్తి అధికారం పంచమని అడిగినా ఆయన విలేదు, కాబట్టి భాగస్వామి చేసిందే కరేక్ట్ అన్నారు. బంధువులను అడిగాము, వారు కూడా, మాకు అంతో ఇంత దక్కింది, ఈ రోజుల్లో నీతి నియమం కష్టార్జితం ఎవరికి కావాలి, కాబట్టి, మేము చేసిందే కరెక్ట్ అన్నారు.

ఇంక నీతి నియమం ధర్మం ఎక్కడ ఉంది? ఇంక మనమెందుకు మధ్యలో న్యాయం చెప్పడానికి, అంత స్పష్టముగా ఉంటే. ఆయన కష్టార్జిత ఆస్తిని, వీరికి రాయాలా? దానికి బతిమాలడమా? అది బెదిరింపు కాదా? వినకపోతే, ఏమైనా చేస్తారా? దీని ఫలితం, ఆ ధనం, అధికారం పంచుకున్న, సమర్దించిన, ప్రతి వారి కుటుంబములో, ఇదే వెన్నుపోటు తర తరాలు కొనసాగుతూ పొతుంది. ఎందుకంటే, స్వయం క్రుషి కన్నా, వెన్నుపోటు నమ్మకద్రోహం దోవ తేలిక గా అందరికీ ఉంటుంది కాబట్టి.

అంటే, మనము కలియుగ పాపాన్ని, 80 శాతం దాటించడానికి, విపరీత క్రుషి చేస్తున్నాము. శభాష్. పంచభూతాలు, మనకే కొండంత మంచి చేస్తాయి, కదూ. ప్రక్రుతి విపరీతాలకు మనం అసలు కారణం కాదు కదూ? అవ్వ.

Ramanna tears again 25 years - requested, warned, at last backstab, Chandranna, Balayya agreed  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,396,532; 104 తత్వాలు (Tatvaalu) and views 258,835
Dt : 16-Oct-2022, Upd Dt : 16-Oct-2022, Category : Politics
Views : 828 ( + More Social Media views ), Id : 1582 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : questioners , insults , doubters , lakshmi , parvati , ntr , traitors , fans , well-wishers , opportunists , balayya , chandranna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content