Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time. చూడండి, ఈ చిన్నారి మానసిక పరిపక్వత, వాచక తపస్సు, అభినయం, స్పష్ట మంత్రోచ్ఛరణ గాత్రం, ఏకాగ్రత తో శ్రీ లలితా సహస్రనామా స్తోత్ర పారాయణం చేయడం అద్భుతం.
ఆ చిట్టి తల్లి ముందు, నేనూ తలవంచి, బాలా త్రిపుర సుందరి, అమ్మ వారు లాగా తలచి, తలవంచి, నమస్కారం చేసినా తప్పలేదు. ఆ చిట్టి తల్లి చదివిన, శాస్త్ర శ్లోకాలు నేనూ చదవలేను, చూసైనా, అంత స్పష్టం గా, ఈ వయస్సు లో కూడా. ఈ జన్మలో ఇలాంటి కూతురు ను, నేనెందుకు జన్మ నివ్వ లేక పోయాను అని బాధపడతా.
వారి తల్లిదండ్రులు ఎంత పుణ్యాత్ములో, ఎంత పుణ్యం చేసుకుంటే, ఆ చిన్న పిల్ల చేత ఇంత పలికించగలరు. అందుకే అంటారు, మనకు దైవ భక్తి ఉందని హైందవుని అని నటిస్తూ మొక్కుబడిగా నోటితో చెపడం కాదు, చేతలలో పనులలో కనపడాలి, పిల్లల నడవడిక ప్రవర్తన తో ఇలా నిరూపించాలి.
అందుకే అందరికీ చెపుతుంటా, పిల్లలకు సాత్విక సంస్కార లక్షణాలు, పదేళ్ల లోపు నే నేర్పాలి సుమా. వారిలో మానసిక మరియు ఆత్మ బలం పెరిగి, తమను తాము తీర్చుకొనేందుకు, మంచి దోవలో నడుపుకునేందుకు ఉపయోగపడుతుంది.
ఆ తర్వాత, ఎదిగిన వయస్సు లో, తప్పు పొరపాటు చేయాలని, ప్రయత్నం చేసినా, తన అంతరాత్మ అలాగే సంస్కారం ఆపుతునే ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది, ఇది తగని పని అని.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2081 General Articles and views 1,820,348; 104 తత్వాలు (Tatvaalu) and views 220,118 Dt : 11-Apr-2021, Upd Dt : 11-Apr-2021, Category : Devotional
Views : 881
( + More Social Media views ), Id : 1084 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
sattvic ,
rituals ,
samskar ,
children ,
under ten ,
god ,
stotra ,
recitation ,
video Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments