ఒకే కుటుంబం-ఓటున్న బాబుల్లారా, వయసొచ్చిన మనుషుల్లారా, వస్తున్నవి ఎన్నికలు, వస్తారు నాయకులు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1617 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1652 General Articles, 61 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*ఒకే కుటుంబం- ఓటున్న బాబుల్లారా, వయసొచ్చిన మనుషుల్లారా, వస్తున్నవి ఎన్నికలు, వస్తారు నాయకులు*

విత్తు ముందా చెట్టు ముందా, గుడ్డు ముందా పిల్ల ముందా, అంటే ఎవరూ చెప్పలేరు. ఓటర్లు చెడ్డవారా, నాయకులు చెడ్డవారా, అంటే మాత్రం అందరూ నాయకులే చెడ్డవారు అని చెపుతారు, మన తప్పు ఒప్పుకోకుండా.

నాయకులు చెడ్డవారని, నియంతలు రాజులు దగ్గర చెప్పవచ్చు కానీ, ప్రజాస్వామ్యములో, నాయకులు అధికారులు ది మొదటి తప్పు ఎప్పుడూ కాదు. ఎందుకంటే, వారిని ఓటుతో ఎన్నుకునేది మనము, అంటే ప్రజలము.

ప్రజలు కు ఎంత వంకర కపట నటన బుద్ది ఉంటే, తమలో నుంచి, తమ నాయకులు ను అంత కన్నా వంకర బుద్ది తో ఉన్నవారినే ఎన్నుకుంటాము. రామరాజ్యములో ప్రజలు మంచి వారు, కాబట్టి రాముడు వారికి రాజు అయ్యారు.

మనము తప్పుడు వారిమి కాబట్టే, మనకు వెన్నుపోటు, అబద్దలు, మోసము, పన్నుపోటు, ఫాక్షనిస్ట్లు, రౌడీలు, కేసులు స్టేలు, ఉన్నవారు మాత్రమే నాయకులు గా వస్తారు.

మనవి పాము, నక్క, పులి బుద్దులు అయినప్పుడు, మనకు ఆవుల వంటి నాయకులను ఎన్నుకోవడానికి మనసు ఒప్పదు.

అందుకే మన నాయకులు కూడా, పాము నక్క పులి లక్షణాలతో, మనల్ని కంటి మీద నిద్ర లేకుండా చేస్తారు 5 ఏళ్ళు, అందుకే ఓటు వేసేటప్పుడు, సాత్విక మంచి మనిషిని ఎన్నుకుంటే, మన కష్టాలు తీరుస్తారు.

లేదంటే, మాయ మాటలు చెప్పి, పప్పు బెల్లాలు పంచి, మనల్ని మన రాష్ట్రాన్ని అప్పులతో, పతన దిశకు శరవేగముగా నడిపిస్తారు. ఈ సారి ఎన్నికల్లో, ఆవునే ఎన్నుకుందామా?

ఓటున్న బాబుల్లారా.., వయసొచ్చిన మనుషుల్లారా.. 2
వస్తున్నవి ఎన్నికలు.., వస్తారు నాయకులు.. 2

చెప్పిన మాటే చెపుతారు, కులాల కైపెక్కిస్తారు 2
బంధుత్వము తిరగేస్తారు, పైసా ఎర చూపిస్తారు 2
కొత్త సంగతులు ఏమిటి అంటే, గుడ్లు రెండు తేలేస్తారు.||ఓటున్న బాబుల్లారా||

ప్రజలకోసం పుట్టినామని పోజు పెడతారు, దేశసేవకు అవతరించిన ఘనులమంటారు 2
అభ్యుదయం అని అరుస్తారయా.., ఆ నాయకులకు ఇది కొత్త జబ్బయా..2
పార్టీలన్నీ ఒక్కటేనయా, పేరులు మాత్రం వేరు వేరయా ||ఓటున్న బాబుల్లారా||

ఓటు విలువ నువ్వు తెలుసుకోండయా, పూట తిండికి లొంగవద్దయా 2
మనిషి మంచినే చూడండయ్య, 2, మాయల్లో పడి మారవద్దయా 2 ఆ ఆ ఆ
ఒక్కనాడు చేసిన పొరపాటుకు, ఐదు ఏళ్ళు నోరెత్తలేమయా ||ఓటున్న బాబుల్లారా||

- ఎస్.పి. బాలు , ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు

తారాగణం నందమూరి తారక రామారావు, లక్ష్మి, కాంతారావు, రాజశ్రీ, అంజలీ,
నాగయ్య

Votunna Baabullara, vastunnavi ennikalu, vastaaru naayakulu, Oke Kutumbam, NTR, Lakshmi, Kantha Rao, Rajashree, Anjali

Cast: NTR, Lakshmi, Kantha Rao, Music: S P Kodandapani, Lyrics: Dasari, Director: A Bhimsingh, 1970, Ghantasala

మిగతా మాటలు పూర్తి వీడియో పాటలు లింక్ లోపల సుమా. మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1652 General Articles, 61 Tatvaalu
Dt : 06-Oct-2022, Upd Dt : 06-Oct-2022, Category : Songs
Views : 85 ( + More Social Media views ), Id : 1567 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : votunna , baabullara , vastunnavi , ennikalu , vastaaru , naayakulu , okekutumbam , ntr , lakshmi , kantharao , rajashree , anjali
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content