జిల్లా మంత్రులు కలెక్టరు కు అధికారుల మీద, అలాగే అధికారులకు, గ్రామ పట్టణాల మీద పట్టు లేదు? - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,007; 104 తత్వాలు (Tatvaalu) and views 225,878.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* కలెక్టర్, ఇక మారరా, మారలేరా?
* అనంతపురం జిల్లా లో
* 2 ధన పంపిణీలు
* సౌకర్యాలు జీతాలు?
* జిల్లా అంతా అస్థవ్యస్థముగా
* పని చేయం, పురోగతి చెప్పం, జీతం మాత్రం
* బుద్ది చెపడానికి, సంఘాలు రావు
* రాజ ద్రోహము?
* పంచాయితీ కబ్జా షాపులకు పన్ను?
* పౌర సమాచార శాఖ
* రెవిన్యూ, జిల్లా అధికారి, ఒంగోల్ ఆర్డీవో
* ఆరోగ్యశాఖ
* డీయెస్పీ, సీయై
* విద్యాశాఖ అధికారి
* వాలంటీర్లు ఉన్నారు అంటే
* పర్మినెంట్ మీరు, వాలంటీర్ అని వారూ
2 min read time.

జిల్లా మంత్రులు కలెక్టరు కు అధికారుల మీద అలాగే అధికారులకు, గ్రామ పట్టణాల మీద పట్టు లేదు

ప్రకాశం (మరియు ఇతర జిల్లాల మరియు రాష్ట్ర) కలెక్టర్, అధికారులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, ప్రజల కు నమస్కరించి వ్రాయునది - అంగుళం అభివ్రుద్ది లేకపోయినా, అధికారుల పనితనం కదిలి, ప్రభుత్వ సోషల్ మీడియా లో, ఇకనైనా కనీసం బొమ్మలతో మాయా సాక్ష్యం, ఏమైనా కనపడుతుందా సామాన్య ప్రజలకు?

జిల్లా అధికారులంతా కలసి, మా సీయెం జగనన్న కు, జిల్లా మంత్రి బాలినేని గారికి, ఎంపీ మాగుంట, విద్యా మంత్రి సురేష్, ఇంచార్జ్ మంత్రి, మున్సిపల్ శాఖామంత్రి బొత్సా గారికి, ఇతర శాఖా మంత్రులకు, చెడ్డ పేరు తేవడము తప్ప, సహకరించి మంచి పేరు, తెద్దామన్న ఉద్దేశ్యమే లేదా 2 ఏళ్ళు గడచినా?

కొత్త ప్రభుత్వం లేదా కలెక్టర్, వచ్చిన దాకా లేదా ఇక మారరా, మారలేరా? మా బతుకులలో వెలుగులు రావా అని, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మా కలెక్టర్ మెతకతనం మరియు అతి మంచితనం, జిల్లా అధికారులను, ఇలా బాధ్యత లేని వారి గా చేస్తుందా లేక కలెక్టర్ అసమర్ధత వలన, మంత్రులు ఎమ్మెల్యేలకు జిల్లా అధికారులకు వత్తాసు పలుకుతూ, పాలన వదిలేశారా? చంద్రన్న ఉన్నంత కాలము, బాగా పని చేసిన అధికారులకు, ఇప్పుడు ఏమైంది? అని అర్ధము గాక తల పట్టుకుంటున్నారు శ్రేయోభిలాషులు. పాత విన్నపము

అనంతపురం జిల్లా లో, అధికార ఎమ్మెల్యేలు, నిప్పు లాంటి కలెక్టర్ దగ్గర, మాకు చీపురు పుల్ల విలువ లేదా అని గగ్గోలు పెడుతున్నారు అంటే, అర్ధం ఏమిటి? ఆయన ఉత్తమ కలెక్టర్ అని, సందేహం లేదు, ఎమ్మెల్యేల మరియు జిల్లా అధికారుల ఆటలు సాగడం లేదు. అధికారులు అంతా, నిబద్దతతో పని చేస్తున్నారు అని అర్ధం.

మరి మన జిల్లాలో ఒక్క అధికార ఎమ్మెల్యే కూడా, కలెక్టర్ ని జిల్లా అధికారులను ఏమీ అనడం లేదు అంటే, ఇక్కడ ప్రజలకు ఉపయోగ పడేవి ఏమీ జరగడం లేదని. అన్యాయమని అడిగే వారు, నాయకుల్లో అలాగే అధికారుల్లో ఎవరు లేరని. అసలు పాలన జరగడం లేదు అని, కాదా? అని ప్రజలు భావిస్తున్నారు.

మన ప్రకాశం జిల్లా లో 2 ధన పంపిణీలు జరుగుతున్నాయి ఆగకుండా - అధికారుల ఎమ్మెల్యే ఎంపీల జీతాల పంపిణీ ఒకవైపు. అలాగే జగనన్న పధకాల ధన పంపిణీ ప్రజలకు ఇంకోవైపు. అంతకు మించి జవాబుదారీ తనము, శ్రద్ద, ఎక్కడా మచ్చుకు కాన రావు. అధికారులు నాయకులు హయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు, మీరు మేము భాయ్ భాయ్ అని ప్రజలకు దూరముగా, అంతేనా? అని ప్రజలు నోరు వెళ్ళబెడుతున్నారు.

మీకు ఏమి లోటు చేసారు మా జగనన్న, 2 ఏళ్ళు గా ఇలాగే అడిగించుకుంటున్నారు, మా చేత, ఎన్ని విన్నపాలు పంపాము? మా జగనన్నకు జరుగుతున్న ద్రోహం అన్యాయం వంచన చూసి, తప్పుగా ఆవేశములో ఏదైనా మాట్లాడితే, మరలా మా వాట్సాప్ ఆపేయడం లేదా మా నోరు మూయించడానికి, కేసులు, ఇదేనా ప్రజా సేవకుల పని? మీరు జగనన్న కే ద్రోహం చేస్తుంటే, ఇంక సామాన్య ప్రజలకు న్యాయం ఎలా చేయగలరు? అని అడగలేని వారు, లోలోపల వేదన చెందుతున్నారు.

సౌకర్యాలు జీతాలు అందడము లేదా? మీకేమి తక్కువైతే, అవి అడిగితే, జగనన్న ఇస్తారు కదా? 2 ఏళ్ళుగా ఎందుకు గమ్ముగా ఉంటారు? ఇది వ్రుత్తి, మనసు మరియు ఆత్మ ద్రోహము కిందికి రాదా?

మేము 2 ఏళ్ళు గా మొత్తుకుంటున్నాము, జిల్లా అంతా అస్థవ్యస్థముగా ఉంది అని. కలెక్టరు కు అధికారుల మీద పట్టు లేదు. జిల్లా అధికారులకు, గ్రామ మరియు పట్టణ అధికారుల మీద పట్టు లేదు.

జిల్లా మంత్రులు ఎవరికీ, అధికారుల మీద పట్టు లేదు బాధ్యత లేదు, అని నిరూపిస్తున్నారు. మంత్రుల ఎమ్మెల్యేల పరువు తీస్తుంది, మీడియా నా, లేక మీరా? చేసిన మంచి పనులు ఉంటే, పబ్లిక్ గా ప్రజలకు చెప్పడానికి ఇష్టపడని అధికారులా? అసలు పనులు జరిగితేనే కదా, పబ్లిక్ కి చెపడానికి అంటారా? అని అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పబ్లిక్ సర్వెంట్ అంటే ఇదేనా? మేము ఏమీ పని చేయం, ఎవరికీ ఏమీ పురోగతి చెప్పం, ఎవరు అడిగినా జవాబు పలకం, జీతం మాత్రం తీసుకుంటాము? జీతం పెంచక పోతే సంఘాలు సమ్మె ధర్నా అంటూ వస్తాయి కాని, సమాచారము ప్రజలకు చెప్పాలి, నీతి గా బాధ్యత గా ఉందాము, ఉద్యోగం తీసుకునేటప్పుడు ప్రమాణం చేసాము, అని తమ సొంత అధికారులకు బుద్ది చెపడానికి మాత్రము సంఘాలు రావు, పలకవు, ఇదేగా ప్రజాస్వామ్యం ప్రభుత్వం అంటే?

కనీసం అనంతపురం జిల్లా ను చూసి కూడా, ముందుకు కదలరా? అన్ని జిల్లా శాఖలు మరియు కలెక్టర్ తో సహా సోషల్ మీడియా నడుపుతూ ఉంటే, మన జిల్లా అధికారులు గమ్ముగా ఉంటారు. మనకు లేనిది ఏమిటి, అనంత అధికారులకు ఉన్నది ఏమిటి? క్రుతజ్ఞత, బాధ్యత, ఆత్మాభిమానం తప్ప? పాత విన్నపము

ఆఖరికి ఒక మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తో కూడా, సొషల్ మీడియా నడిపించలేని దౌర్భాగ్య స్థితిలో, మన ప్రకాశం జిల్లా అధికారులు మంత్రులు ఉన్నారు. ఇంతకన్నా రాజ ద్రోహము ఇంకోటి ఉన్నదా? అని జనము విస్తుపోతున్నారు. - పాత విన్నపము

అంటే, మీరంతా, మా ప్రియతమ ముఖ్యమంత్రి దగ్గర, ప్రజా పన్నులు, నెలా నెలా ఠంచనుగా జీతాలు గా తీసుకుంటూ కూడా, 2 ఏళ్ళుగా త్రికరణ శుద్దిగా ద్రోహం చేస్తున్నారు అంటే, తప్పు పడతారా కోపము వస్తుందా మీకు? చూడండి ఉదాహరణలు

* కబ్జా షాపులకు పన్ను ఉందా, కొత్తవి అనుమతి ఇస్తారా అంటే, ఆన్లైన్ పన్నులు 2 ఏళ్ళుగా అడుగుతూ ఉంటే, పంచాయితీ అధికారులు, అలాగే పోలీసులు మాట్లాడరు. ఎమ్మెల్యేలు పలకరు, మా పాలనలో అవినీతి బంధు పక్షపాతం అక్రమ సంపాదన ఉందా అని? పాత విన్నపము పాత విన్నపము

* జిల్లా సమాచారం అనంత జిల్లాను చూసినా ఎందుకు పెట్టరు అంటే - కలెక్టర్, మంత్రి, జిల్లా అధికారులు, గ్రామ పట్టణ అధికారులు మాట్లాడరు.

* పౌర సంబంధ సమాచార శాఖ, అసలు ఎందుకు ఉందో జిల్లా లో, వారి పని ఏమిటో, వారికి కూడా తెలీదు. వారూ మాట్లాడరు. కనీసం న్యూస్ కూడా అప్డేట్ రోజూ పెట్టరు, పెట్టింది సరిగ్గ చేయరు.

సోషల్ మీడియా ఎవరు ఎలా నడపాలి అన్నది, జిల్లా పట్టణ గ్రామ అధికారులకు నేర్పరు, వీరు చేయరు. ఆ ఫోటోలు చూడండి తెల్లగ, ఒక్క ఫోటో ఇక్కడ చూపించలేరు కదా మొదటి పేజీలో. లోపల పేజీలో పూర్తి వివరాలు మరియు అధికారుల పేర్లు ఉండవు. నత్త నడకలో తక్కువ సమాచారంతో రోజూ వార్తలు లేని ప్రభుత్వ జిల్లా న్యూస్ పేజ్ పాత విన్నపము పాత విన్నపము.

* రెవిన్యూ వారిని, సోషల్ మీడియా ఏది? మా తాసిల్దారు, ఆర్డీవో ఏమి చేస్తున్నారు అంటే, జిల్లా రెవిన్యూ అధికారి, ఒంగోల్ ఆర్డీవో, వేటపాలెం చీరాల పర్చూర్ ఎమ్మార్వోలు వాట్సాప్ ఆపేస్తారు. ఆదాయ దేవతలమైన మమ్మల్ని మా అవినీతిని, కలెక్టరే అడగలేరు, ఆఫ్ట్రాల్ విలేఖరివి నీకు చెప్పాలా, మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు అని, ఫోన్లు ఆపేశారు. పాత విన్నపము పాత విన్నపము.

* మా ఆరోగ్యశాఖను సోషల్ మీడియా ఏదీ, ఒంగోలు చీరాల ఆసుపత్రుల సమాచారం ఏమిటి అంటే, వారు పలకరు ఉలకరు. కరోనా తర్వాత, జనం మిగిలి ఉంటే చూద్దాం లే అని. పాత విన్నపము.

* డీయెస్పీ, సీయై ల ను స్థానిక సోషల్ మీడియాలో, కరోనా జాగ్రత్తలు అలాగే తమ సిబ్బంది త్యాగాలు సేవలు చెప్పమంటే, వారూ పలకరు. పాత విన్నపము.

* విద్యాశాఖ అధికారి, మా ఊళ్ళో స్కూల్స్ ఎలా పనిచేస్తున్నాయి అని చూద్దామంటే, ఆయనా అలాగే వారి కింద అధికారులు సోషల్ మీడియా నడపరు. మిగతా వారిని కదా అడుగుతుంది, మనల్ని అడగరు లే. వారిని అడిగినట్లు, మనల్ని అడిగితే, వాట్సాప్ ఆపేద్దాం అనుకున్నారు ఏమో మరి.

అనంత వారికి పని లేదేమో సోషల్ మీడియా నడిపి ప్రజలకు దగ్గర గా ఉన్నారు, మేము మంత్రులకు పై అధికారులకు, నమస్కారాలు పెడుతూ, దగ్గర ఉంటే చాలులే అని చాలా మంది అధికారుల భావన.

* మీ అందరితో తలనొప్పి ఎందుకులే, వాలంటీర్లు ఉన్నారు అంటే. వారిదీ ఉద్యోగం కాదు అనేసరికి, ఎప్పుడైనా ఊడేదానికి, ఆవేశం ఎందుకు అని, వారూ సైలెంట్.

పర్మినెంట్ అయి మీరు పని చేయరు, వాలంటీర్ అని వారూ, పని చేయరు. ఇక మా జగనన్న తరపున, మిమ్మల్ని ప్రశ్నించేది ఎవరు?

మా ప్రకాశం అధికారులు బాగా చేస్తున్నారు, మీరు ఎందుకు చేయరు అని, ఇతర జిల్లా అధికారులను నిలదీసే భాగ్యం మాకు ఇవ్వరా, ఇంకో 3 ఏళ్ళకు కూడా?

ఎవరు మా జిల్లా అధికారులను నిద్రలేపేది? 2 ఏళ్ళు గా మా జిల్లా అధికారులు మంత్రుల వల్ల, పని కాదని తేలిపోయింది. డెప్యుటేషన్ మీదన్నా, చిత్తూర్ అనంత అధికారులను ఎమ్మెల్యేలను తెమ్మని కూడా కోరాము, ఎవరూ పలకరు ఉలకరు. పాత విన్నపము

అయ్యా ఇతర జిల్లా అధికారులు మంత్రులు నాయకులు, మీరన్నా మా యందు దయ ఉంచి, మా అధికారులు మంత్రులకు, అడ్మినిస్ట్రేషన్ అలాగే సోషల్ మీడియా నిర్హాహణ, బాధ్యత గా పని చేయడము, పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజలకు అందుబాటులో ఉండి, ఎలా జవాబు చెప్పాలి గ్రామ పట్టణ స్థాయిలోనే, జిల్లా అధికారుల కు పని ఒత్తిడి తగ్గించడానికి, మార్గాలు సూచనలు చెప్ప గలరు నేర్ప గలరు.

రాష్ట్ర అధికారులు, చీఫ్ సెక్రటరీ, అలాగే జగనన్న కు చెప్పగలరు. మా జిల్లా ఒక్కటే ఇలా ఉందా, అన్ని జిల్లాలు ఇలాగే నిద్రావస్థలో ఉన్నాయా? ఎందుకంటే, సోషల్ మీడియా నడుపుతుంది, 4 గురు కలెక్టర్లు మాత్రమే ని గతములో అనుకున్నాం. - పాత విన్నపము

ఎప్పటి లాగే, మా జిల్లా బాగుపడాలి, నిద్ర లెగిచి నడక సాగించాలి, అని 50 వ సారి, కలలో తీరని కోరిక కోరుకునే, అజ్ఞాన విలేఖరి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,007; 104 తత్వాలు (Tatvaalu) and views 225,878
Dt : 05-Apr-2021, Upd Dt : 05-Apr-2021, Category : Request
Views : 859 ( + More Social Media views ), Id : 1076 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : prakasam , district , ministers , collector , grip , district officers , village , town , officers , balineni , bhaskar , suresh , magunta
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content